The Ghost Review : ది ఘోస్ట్‌ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది.. నాగార్జున హిట్‌ కొట్టారా..?

October 5, 2022 12:30 PM

The Ghost Review : వైవిధ్యభరితమైన చిత్రాలను చేయడంలో కింగ్‌ నాగార్జున ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఆయన గతంలో చేసిన వైల్డ్‌ డాగ్‌, గగనం అలాంటి చిత్రాతే. సరిగ్గా అదే జోనర్‌లో ఇప్పుడు ఘోస్ట్‌ ద్వారా మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ అక్టోబర్‌ 5న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. కథ ఏమిటి.. అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..

కథ..

విక్రమ్‌ (నాగార్జున), ప్రియ (సోనాల్‌ చౌహాన్‌) ఇంటర్‌పోల్‌ ఆఫీసర్లు. వీరు ఒకరి తరువాత ఒకరు ఒక మిషన్‌ కోసం వెళ్తారు. అయితే విక్రమ్‌ వెళ్లిన మిషన్‌ మాత్రం ఫెయిల్‌ అయిపోతుంది. దీంతో అతను ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోతాడు. అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. తరువాత ఒక హై ప్రొఫైల్‌ ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి బాడీగార్డ్ గా ఉంటాడు. ఈ క్రమంలోనే ఆమెను కొందరు కిడ్నాప్‌ చేయాలని అనుకుంటారు. అయితే విక్రమ్‌ వారిని అడ్డుకున్నాడా.. అసలు ఘోస్ట్‌ ఎవరు.. అతను ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు.. చివరకు ఏమవుతుంది.. అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

The Ghost Review Nagarjuna movie how is it
The Ghost Review

విశ్లేషణ..

ఈ మూవీలో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటించారు. గతంలో ఆయన నటించిన గగనం, వైల్డ్‌ డాగ్‌ లాగే ఈ చిత్రం కూడా యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఉంటుంది. అలాగే సోనాల్‌ చౌహాన్‌ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడి విషయానికి వస్తే.. ప్రవీణ్‌ సత్తారు గతంలో తాను తీసిన పీఎస్‌వీ గరుడ వేగ లాగే థ్రిల్లర్‌గా ఘోస్ట్‌ మూవీని తెరకెక్కించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే సినిమాలో కొన్ని సీన్లు అద్భుతంగా వచ్చాయి. కానీ కొన్ని సీన్లను సరిగ్గా తీయలేకపోయారు. అలాగే గుల్‌ పనాగ్‌, మనీష్‌ చౌదరి, అనిఖా సురేంద్రన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రవి వర్మ తదితరులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.

కాగా మార్క్‌ కె రాబిన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంది. ముకేష్‌ జి సినిమాటోగ్రఫీ, దినేష్‌ సుబ్బరాయన్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీలలో అంతగా పసలేదు. ఈ మూవీకి నాగార్జున యాక్టింగ్‌, కొన్ని యాక్షన్‌ సీన్లు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్లస్‌ పాయింట్లు కాగా ఎమోషన్‌ లేని సీన్లు, కథ బలహీనంగా ఉండడం, విలన్లు మరీ వీక్‌గా ఉండడం.. మైనస్‌ పాయింట్లు. అయితే కొత్తదనం కోరుకునేవారు ఈ మూవీని ఒకసారి చూడవచ్చు. అది కూడా నాగార్జున యాక్టింగ్‌, యాక్షన్‌ సీన్లను చూసే వెళ్లాలి. అంత ఓపిక ఉంటే ఓకే. లేదంటే లైట్‌ తీసుకోవడమే బెటర్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now