Akhanda Movie : అఖండ అంత‌టి హిట్ అవ‌డం వెనుక ఆ యువ నిర్మాత ఉన్నార‌ట‌..?

December 5, 2021 10:26 AM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తూ దూసుకుపోతోంది. కార‌ణం ఏదైనా కావ‌చ్చు, ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం విజ‌యం సాధించింది. అభిమానుల‌కు ఈ మూవీ చ‌క్క‌ని వినోదాన్ని అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే మాస్ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

అయితే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఓ యంగ్ ప్రొడ్యూస‌ర్ బాల‌కృష్ణ అఖండ మూవీకి ఇంత‌టి హైప్ వ‌చ్చేందుకు కృషి చేశాడ‌ట‌. దీంతో ఈ వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సినిమాకు, ఆయ‌న‌కు అస‌లు ఎలాంటి సంబంధం లేద‌ట‌. కానీ ఆయ‌న వ‌ల్లే బాల‌కృష్ణ సినిమాకు చాలా హైప్ వ‌చ్చింద‌ట‌. ఇక ఆయ‌న కూడా ఓ పెద్ద స్టార్‌తో ప్ర‌స్తుతం ఓ సినిమాను చేస్తున్నారు.

that young producer is there for Akhanda Movie success

స‌ద‌రు ప్రొడ్యూస‌ర్ త‌న వ‌ర్గానికి చెందిన కాంటాక్ట్స్‌తో ఓ లిస్ట్ త‌యారు చేసి అఖండ మూవీ కోసం భారీ ఎత్తున ప‌బ్లిసిటీ చేసి హైప్ తెచ్చార‌ట‌. అందువ‌ల్లే అఖండ‌కు అంత‌టి ఓపెనింగ్స్ వ‌చ్చాయ‌ని అంటున్నారు. అయితే ఆ నిర్మాత కేవ‌లం బాల‌కృష్ణ మీద ఉన్న అభిమానం వ‌ల్లే అలా చేశాడ‌ట‌. కానీ ఈ విష‌యం బాల‌కృష్ణ‌కు కూడా తెలియ‌ద‌ని అంటున్నారు.

ఇక ఆ ప్రొడ్యూస‌ర్ ఎక్కువ‌గా మెగా హీరోల‌తోనే సినిమాలు చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ అఖండ‌కు హైప్ తేవ‌డంలో ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. దీంతో ఆయ‌న గురించి చ‌ర్చ న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now