Thank You Movie First Review : నాగ‌చైత‌న్య థాంక్ యూ మూవీ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..!

July 19, 2022 8:54 PM

Thank You Movie First Review : నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ మూవీకి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీంతో సినిమాపై అందరిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగానే చైతూ, రాశి ఖ‌న్నా ఇద్ద‌రూ చాన‌ల్స్ కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

థాంక్ యూ మూవీలో చైతూ అభిరామ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఒక సాధార‌ణ వ్య‌క్తి పెద్ద వ్యాపార‌వేత్త‌గా ఎలా మారాడు.. అందుకు వెన‌క ఉండి నడిపించింది ఎవ‌రు.. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంది.. అన్న క‌థ ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. అభిరామ్ పెద్ద వ్యాపార వేత్త‌గా ఎదిగేందుకు త‌న క‌ష్ట‌మే కార‌ణ‌మ‌ని అనుకుంటూ ఉంటాడు. కానీ త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కార‌ణంగా త‌న స‌క్సెస్‌కు కార‌ణం తాను కాద‌ని.. ఇత‌రులు అని తెలుస్తుంది. దీంతో అత‌ను ఎలా మారుతాడు ? అస‌లు అభిరామ్ ఎలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కొంటాడు ? అత‌ని స‌క్సెస్ వెనుక ఉన్న‌ది ఎవ‌రు ? అన్న విష‌యాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Thank You Movie First Review know how is it
Thank You Movie First Review

ఇక ఇందులో రాశి ఖ‌న్నాతోపాటు మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్‌లు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కులను ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ఇక ఇందులోని డైలాగ్స్ చైతూ నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అవి ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ల‌లో మ‌న‌కు వినబ‌డ్డాయి. దీంతో స‌మంత‌ను ఉద్దేశించి ఇంకా ఏమైనా డైలాగ్స్ ఉంటాయా.. అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధిస్తుంద‌నే అంటున్నారు. మ‌రి దీనికి టాక్ ఎలా వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now