Thaman : నాన్న చ‌నిపోయాక వ‌చ్చిన డ‌బ్బుతో.. డ్ర‌మ్స్ కొన్నానన్న థ‌మ‌న్..!

December 23, 2021 4:45 PM

Thaman : ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ గురించే మాటలు వినిపిస్తున్నాయి. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న థ‌మ‌న్ రీసెంట్‌గా అఖండ చిత్రంతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఏ స్టార్‌ హీరో సినిమా ప్రారంభం అయినా సంగీత దర్శకుడు ఎవరు అంటే థమన్‌ పేరే వినిపిస్తోంది. హీరోలు, డైరెక్టర్లు కూడా థమన్‌తోనే పని చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మ్యూజిక్ సెన్సేష‌న్ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనుక ఎంతో కష్టం ఉందని చెప్పాడు థమన్‌.

Thaman said he bought drums with the money after his fathers death

తాజాగా ఓ కార్య‌క్రమంలో మాట్లాడిన థ‌మ‌న్.. నాకు డ్రమ్స్ వాయించడంపై ఆసక్తి మా నాన్న దగ్గర నుంచి కలిగింది. అయన చాలా బాగా డ్రమ్స్ వాయించేవారు. మా తాతయ్య ఇంటికి వెళ్లి వస్తుండగా ట్రైన్‌లో మా నాన్న గారికి గుండెపోటు వచ్చింది.. చికిత్స ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్ఐసీ పాలసీ 60 వేల రూపాయలతో మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిచ్చిందని తెలియ‌జేశాడు థ‌మన్.

నేను మొదటి సారి డ్రమ్మర్ గా పనిచేసిన సినిమా భైరవద్వీపం. ఈ సినిమాకు నాకు 30 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు థమన్. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా  తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న థ‌మ‌న్ ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా చేస్తున్నాడు. అలాగే మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రాంచరణ్ శంకర్ సినిమా, వరుణ్ తేజ్ గని, మహేష్ త్రివిక్రమ్ సినిమా, మెగాస్టార్ గాడ్ ఫాదర్.. ఇలా మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now