Thaman : ఏంటీ థమన్ బ్రో.. గాడ్ ఫాదర్ BGM కూడా కాపీయేనా అంటూ థమన్ పై పంచులు..!

August 23, 2022 9:15 AM

Thaman : సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు థమన్. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే థమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది. ప్రస్తుతం థమన్ పని చేస్తున్న క్రేజీ సినిమాల్లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఒకటి.

ఈ మూవీ టీజర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. తెలుగు-హిందీ టీజర్లను విడుదల చేయగా అవి వైరల్ గా మారాయి. అయితే ఈ టీజర్ మ్యూజిక్ మాత్రం అభిమానులకు రుచించడం లేదు. కాపీ క్యాట్.. రిపీట్ థీమ్ ! అంటూ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. గాడ్ ఫాదర్ టీజర్ థీమ్ (బీజీఎం) వినగానే వరుణ్ తేజ్ గని మూవీ థీమ్ ను పోలి ఉందని విమర్శిస్తున్నారు. థమన్ లో క్రియేటివిటీ ఏమైంది ? అతడు కొత్తగా ఆలోచించలేదేమిటో అంటూ పంచ్ లు విసురుతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ కి అవసరమైన ఒరిజినల్ ట్యూన్ ని క్రియేట్ చేయడంలో థమన్ విఫలమయ్యాడనేది ఫ్యాన్స్ విమర్శ.

Thaman being trolled by netizen for copying music
Thaman

అంతేకాకుండా ఈ సినిమాపై మరో కామెంట్ కూడా ఉంది. గాడ్ ఫాదర్ టీజర్ ని సరిగ్గా గమనిస్తే చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి వచ్చే సీన్ గ్రాఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు హీరోల ముఖాలు తీసుకొచ్చి అతికించి గ్రాఫిక్స్ చేశారేమో అని అంటున్నారు నెటిజన్స్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ మళ‌యాళంలో హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్. గాడ్ ఫాదర్ లో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now