Temple Pradakshinas : కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ముందుగా దైవం సహాయం కోసం చూస్తాడు. తనను కష్టాల నుంచి గట్టెక్కేలా చేయాలని వేడుకుంటాడు. అందుకోసం ఆలయాలను దర్శిస్తాడు. పూజలు చేస్తాడు. అయితే కష్టాలు లేనప్పుడు మనిషికి దైవ చింతన అనేది ఉండదు. దైవం గుర్తుకు రాదు. కానీ కష్టాలు ఉన్నా లేకున్నా.. దైవాన్ని మనం మరిచిపోకూడదు. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. అది మనిషిని ప్రశాంతంగా మారుస్తుంది. విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తుంది. కనుక మనిషి దైవానికి నిత్యం పూజలు చేయాలి. ఆలయాలను సందర్శించాలి. అయితే ఎంతటి బిజీ లైఫ్ ఉన్నా సరే దైవ దర్శనం అనేది మనకు ప్రశాంతతను అందిస్తుంది. కనుక వారంలో కనీసం ఒక్కరోజు అయినా సరే ఆలయానికి వెళ్లాలి. దైవాన్ని దర్శించుకోవాలి.
ఇక ఆలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ప్రదక్షిణలు ముఖ్యమైనవి. సాధారణంగా ఎవరైనా సరే ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా దైవాన్ని దర్శించుకుని అనంతరం ప్రదక్షిణలు చేస్తారు. తరువాత మళ్లీ దైవాన్ని దర్శించుకుంటారు. ఇలా ఎవరి ఇష్టానికి తగినట్లు వారు దైవాన్ని దర్శించుకుంటారు. అయితే ఆలయానికి వెళ్లినప్పుడు గర్భ గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి.. అనే విషయంలోనే చాలా మంది అనుమాన పడుతుంటారు. కొందరు ఒక్కసారి చాలంటారు. కొందరు రెండంటారు. కొందరు మూడు సార్లు చేస్తారు. అయితే దీని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. పండితులు ఏమంటున్నారు.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
3 సంఖ్య సత్వ రజో తమో గుణాలని, భూర్భువస్సువర్లోకాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది. మామూలుగా ప్రదక్షిణం చేసేప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే చేస్తారు. దేవాలయంలో గర్భగుడి, ధ్వజ స్తంభాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అరుణా చలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు. దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు. ఇంద్ర యాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. దానివల్ల ఎంతటి మహోన్నత ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం కచ్చితంగా 3 ప్రదక్షిణలు చేయాలి. ఇక బేసి సంఖ్యలో ఆపైన ఎన్ని ప్రదక్షిణలు అయినా చేయవచ్చు. అది వారి ఇష్టం. అయితే కొన్ని ఆలయాల్లో 108, 116 ఇలా ప్రదక్షిణలు చేస్తారు. అక్కడి ఆలయ చరిత్ర, పురాణం, ఇతర విషయాలను బట్టి ఇది ఆధార పడి ఉంటుంది. కానీ సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే 3 ప్రదక్షిణలను తప్పక చేయాల్సి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…