Temper Movie : ఎన్టీఆర్ టెంప‌ర్‌ సినిమాని ఆర్.నారాయణమూర్తి అందుకే వ‌ద్ద‌న్నారట‌..!

October 20, 2021 10:33 AM

Temper Movie : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన మూర్తి పాత్ర కూడా ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. ఎన్టీఆర్ అవినీతిని నేరుగా ప్రశ్నించే పాత్ర అది. ముఖ్యంగా ఎన్టీఆర్.. మూర్తి సెల్యూట్ చేయండి.. అని అడిగినప్పుడు.. నా చేతిని అయినా నరుక్కుంటా గానీ మీకు మాత్రం సెల్యూట్ చేయను సార్ అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ పాత్రకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందుగా ఆర్.నారాయణ మూర్తిని ఊహించుకుని ఆ పాత్ర రాసుకున్నారట.

Temper Movie this is why r narayanamurthy did not do in posani role

అందుకే ఈ పాత్రకు మూర్తి అనే పేరును పెట్టారు. ఈ విషయం ఆయనకు చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఆర్.నారాయణ్ మూర్తి రిజెక్ట్ చేశారట. ఈ విషయంలో ఆర్.నారాయణమూర్తిని ఒప్పించే విషయంలో ఎన్టీఆర్ కూడా ట్రై చేశారట. అసలు టెంపర్ సినిమాలో ఆ పాత్రను ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్య్వూలో తెలిపారు. నిజానికి టెంపర్ సినిమాలో మూర్తి అనే పాత్ర ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. తనతో ఓ గొప్ప వేషం వేయించాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారని.. ఆ క్యారెక్టర్ తనకు ఎంతో ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నారట.

అంత గొప్ప పాత్రను తనకు ఇవ్వాలని అనుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సెల్యూట్ అని అన్నారు. అయితే ఆ పాత్రను చేయాలని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ప్రేమగా అడిగారని నారాయణమూర్తి తెలిపారు. కానీ ఆయన ఒప్పుకోకపోవడానికి కారణం.. ఆర్.నారాయణమూర్తి కెరీర్ ను స్టార్ట్ చేశాక.. క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరోగా ఎదిగానని, మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేక ఆ పాత్రను వదులుకున్నానని అన్నారు. అంతే తప్ప మరే కారణం లేదని అన్నారు. అలా టెంపర్ సినిమా నుండి ఛాన్స్ కాదనుకున్నానని.. ఆర్.నారాయణ మూర్తి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now