కరోనా మహమ్మారి ఎన్నో బంధాలను విడదీసి ఎన్నో కుటుంబాలలో తీవ్ర అలజడి సృష్టించింది. ఎంతోమంది తమ ప్రాణానికి ప్రాణమైన ఆప్తులను కోల్పోయి జీవచ్చవంలా బతుకుతున్నారు. మరికొందరు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా వీధిన పడ్డారు. ఇటువంటి ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో కలలు కంది. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తున్న టువంటి వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవాలనే కలలు కనింది.మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి అడుగు పెట్టబోతునాన్న సంతోషంలో ఉండగానే తన జీవితంలోకి కరోనా మహమ్మారి దాపురించింది.
కరోనా బారిన పడ్డ ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువతిని ప్రేమించిన యువకుడు తనకు ఎంతో ధైర్యం నూరిపోశారు. నీకు ఏమి కాదు నువ్వు ధైర్యంగా బయటికి వస్తావు మనం కలలుగన్న ప్రపంచంలో బతుకుదామని భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై కి మార్చారు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు డాక్టర్ల తో మాట్లాడి ఏకంగా ఐసీయూలో కి వెళ్లి ఆ యువతికి ధైర్యం చెప్పాడు. తాళిని తీసుకుని వెళ్లి ఆస్పత్రి బెడ్ పైనే తాళి కట్టి ఇప్పటినుంచి నువ్వు నా భార్యవి.. నేను నీ భర్తను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాం అని భరోసా ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువు చేతిలో ఓడిపోయింది. మరణించిన యువతి అంత్యక్రియల భర్త హోదాలో ఆ యువకుడు ఆమె సోదరుడు నిర్వహించారు. అయితే తాను మరణించినట్లు ఇప్పటివరకు ఇంట్లో వారికి తెలియదు. ఆ బాధను తనలోనే దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…