“టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడ లాగా కూలిపోవ‌డం ఖాయం”

June 27, 2021 6:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. వారిద్ద‌రిపై అర‌వింద్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇద్ద‌రినీ తీవ్రంగా విమ‌ర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎంపీ ధర్మపురి అరవింద్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడ లాగా కూలిపోతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడ‌ని అన్నారు.

trs government will fall like playing cards mp dharmapuri arvind

భైంసా పట్టణంలో ఒక్క హిందువునూ ఉంచడం లేదు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటల రాజేందర్‌పై కుట్ర చేశారు. కేసీఆర్‌కు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్‌ను తీసుకొచ్చి ఇక్కడ (హుజురాబాద్) నిలబెట్టాలి. పైసలు తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఈటలకు టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓ బెవకూఫ్. హుజురాబాద్ ఎన్నిక కోసం కేసీఆర్ మూడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కర్మ కాలి టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే అధికారులు బానిసలు అవుతారు.. అని అర‌వింద్ అన్నారు.

దళితులను కేసీఆర్ అవమానించినంతగా ఇంకా ఎవరూ అవమానించలేదు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు ముఖ్య మంత్రులు ఉన్నారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటుండు. తెలంగాణలో ఫ్యాక్టరీలు ఎందుకు అమ్ముతున్నవు..? అని కేసీఆర్‌పై అరవింద్ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now