తెలంగాణ

తెలంగాణ‌లో లాక్ డౌన్‌.. వేటికి అనుమ‌తులు ఉంటాయి, వేటికి ఉండ‌వు.. తెలుసుకోండి..!

తెలంగాణ‌లో బుధ‌వారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ ను విధిస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. సీఎం కేసీఆర్ అధ్యక్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ్గా అందులో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటిల్లో లాక్‌డౌన్ కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే అన్ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులు ఉంటాయి. త‌రువాత కేవ‌లం కొన్నింటిని మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌లో వేటికి అనుమ‌తులు ఇచ్చింది, వేటికి ఇవ్వ‌లేదు.. అనే పూర్తి వివ‌రాలను ఇక్క‌డ తెలుసుకోండి..!

1. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు 33 శాతం సిబ్బందితో ప‌నిచేస్తాయి. లాక్‌డౌన్ నుంచి వ్య‌వ‌సాయ రంగానికి మిన‌హాయింపులు ఇచ్చారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ ప‌నులు య‌థావిధిగా కొన‌సాగుతాయి.

2. రోజూ ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 4 గంట‌ల పాటు మాత్ర‌మే అన్ని కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తిస్తారు. మిగిలిన 20 గంట‌లూ క‌ఠినంగా లాక్ డౌన్‌ను అమ‌లు చేస్తారు.

3. మే 20వ తేదీన కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించి రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి లాక్‌డౌన్‌ను కొన‌సాగించాలా, వ‌ద్దా అనే విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటారు.

4. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్‌సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.

5. ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, ఆయా ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులు ఇస్తారు.

6. తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, విద్యుత్‌, మీడియా సంస్థ‌ల‌కు మిన‌హాయింపులు ఇచ్చారు.

7. జాతీయ ర‌హ‌దారుల‌పై ర‌వాణా య‌థావిధిగా కొన‌సాగుతుంది. పెట్రోల్‌, డీజిల్ పంపుల‌కు మిన‌హాయింపులు ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్‌, వేర్ హౌసింగ్ కార్య‌క‌లాపాల‌కు మిన‌హాయింపులు ఉంటాయి.

8. బ్యాంకులు, ఏటీఎంలు య‌థావిధిగానే ప‌నిచేస్తాయి. పెళ్లిళ్ల‌కు ముందుగా అనుమ‌తి తీసుకోవాలి. 40 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇస్తారు. అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది.

9. తెలంగాణ రాష్ట్రానికి ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే స‌రిహ‌ద్దుల చోట చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేస్తారు. ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఆర్‌టీసీ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. రేష‌న్ షాపులు కూడా అదే స‌మ‌యంలో తెరిచి ఉంటాయి.

10. ఎల్‌పీజీ స‌ర‌ఫ‌రాకు మిన‌హాయింపులు ఇచ్చారు.

11. సినిమా హాళ్లు, క్ల‌బ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, అమ్యూజ్‌మెంట్ పార్క్ లు, స్టేడియాలు మూసి ఉంటాయి.

12. మ‌ద్యం షాపుల‌ను ఉద‌యం 6 నుంచి 10 వ‌ర‌కు తెర‌వాల‌ని నిర్ణ‌యించారు. కానీ అందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవోను జారీ చేయాల్సి ఉంటుంద‌ని రాష్ట్ర ఆబ్కారీ శాఖ తెలిపింది. క‌నుక నేడో, రేపో జీవో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఆ త‌రువాత మ‌ద్యం షాపుల‌ను తెరుస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM