చికెన్ రేట్ల‌ వెనుక ఇంత కుట్ర జరుగుతోందా..!

April 14, 2021 8:09 PM

రాష్ట్రంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర దాదాపు 250 నుంచి 300 వరకు ధర పలుకుతోంది. ఈ విధంగా చికెన్ ధరలు ఉన్నఫలంగా పెరగటంతో సామాన్య ప్రజలకు చికెన్ కూడా అందని ద్రాక్ష పండులా మారిపోయింది. మార్కెట్లో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులకు మాత్రం ఏ విధమైన లాభం రావడం లేదు. ఈ పౌల్ట్రీ వెనుక అతిపెద్ద మాఫియా జరుగుతోందని, అందుకే తమ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కలేదని రైతులు వాపోతున్నారు.

మార్కెట్లో బర్డ్ రేటు కిలో రూ. 180 దాకా ఉంటుందని, కానీ దళారులు మాత్రం తమకు కేవలం రూ.120 మాత్రమే చెల్లిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడి పిల్లలకు, దానాకు లక్షల్లో ఖర్చు చేసి 45 రోజుల పాటు వాటిని సంరక్షిస్తే తమకు ఎంత వస్తుందో… అంతే దళారులు కూడా లాభం పొందుతున్నారని తెలిపారు.

ట్రేడర్లు కంపెనీ మాయాజాలం కారణంగా రాష్ట్రంలో దాదాపు 70 శాతం పౌల్ట్రీ రైతులు ఇంటిగ్రేషన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయారు. అంటే చికెన్ విక్రయించే రైతులు వారి పౌల్ట్రీ ఫారాలను సదరు కంపెనీలు లీజుకు తీసుకుని, ఆ పౌల్ట్రీ ఫామ్ లో రైతులను కూలీలుగా మార్చేస్తున్నారు. కంపెనీ సప్లై చేసే కోడి పిల్లలు, దాన ఆధారంగా వాటిని పెంచి పెద్ద చేస్తే వారికి కూలి రూపంలో చెల్లిస్తున్నారు. ఇందుకోసం కంపెనీ రైతులకు కిలో కు ఐదు నుంచి ఆరు రూపాయల చొప్పున మాత్రమే చెల్లిస్తోంది. ఈ విధంగా పౌల్ట్రీ రైతులను ఇంటిగ్రేట్ సిస్టమ్ లోకి మార్చుకొని చికెన్ ధరలను అమాంతం పెంచుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment