తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

June 8, 2021 8:27 PM

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను మ‌రింత‌గా స‌డ‌లించారు. ఇప్ప‌టి వ‌రకు ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండేవి. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఇళ్ల‌కు వెళ్లేందుకు మ‌రో గంట అద‌నంగా స‌డ‌లింపులు ఇచ్చారు. అయితే ఇక‌పై ఉద‌యం 6 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌ల స‌డ‌లింపు ఉంటుంది. ఇంకో గంట ఇంటికి వెళ్లేందుకు అద‌నంగా స‌డ‌లింపు ఉంటుంది. దీంతో మొత్తం 12 గంట‌ల పాటు స‌డ‌లింపులు ఉంటాయి. ఇక సాయంత్రం 6 నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది.

another 10 days lock down extended in telangana

జూన్ 9వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ గ‌డువు ముగియ‌నుండ‌డంతో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ స‌మయం పాటు చ‌ర్చించింది. లాక్‌డౌన్ పొడిగింపు, క‌రోనా మూడో వేవ్, టీకాల పంపిణీ వంటి అనేక అంశాల‌పై సీఎం, మంత్రులు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజుల పాటు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతోపాటు నూత‌నంగా స‌వ‌రించిన ప్ర‌కారం లాక్‌డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు ఉంటుంది.

కాగా జూన్ 21వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఉచితంగా టీకాల‌ను ఇస్తామ‌ని మోదీ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now