Tejaswi Madivada : బిగ్‌బాస్ షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు ఎంతో పాపులర్ అయ్యారు. వారు అనేక చాన్స్‌లను అందిపుచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా డిమ్ లైట్‌లోనే ఉండిపోయారు. అలాంటి వారిలో నటి తేజస్వి మడివాడ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకు కొదువ ఏమీ లేదు. కానీ ఆఫర్లే రావడం లేదు. వచ్చినా ఆమె నటిస్తున్న సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు. దీంతో ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇక తాజాగా ఈమె తన గ్లామర్ షోతో మరోమారు వార్తల్లో నిలిచింది.

సాధారణంగా తెలుగు నటీనటులకు అవకాశాలు రావంటారు. కానీ టాలెంట్ ఉండాలే గానీ.. లక్‌తో ముందుకు కొనసాగవచ్చు. తేజస్వికి టాలెంట్ ఉన్నా.. లక్ కలసి రావడం లేదు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నా.. ఈమెకు వచ్చిన అవకాశాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. ఇక తాజాగా ఈమె చేసిన ఫొటోషూట్‌లో అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ నెల 26వ తేదీ నుంచి బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న విషయం విదితమే. అందులో తేజస్వి మడివాడకు మరోమారు చాన్స్ వచ్చిందని అంటున్నారు. మరి మరోమారు ఈమె బిగ్‌బాస్‌లో అలరిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.