Teenmar Mallanna : 7200 అంటే ఏమిటో చెప్పేసిన తీన్మార్ మ‌ల్లన్న‌..!

May 1, 2022 2:00 PM

Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌భావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయ‌న త‌న క్యూ న్యూస్ చాన‌ల్ ద్వారా ఓ వైపు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూనే.. మ‌రోవైపు అవినీతి నాయ‌కుల భ‌ర‌తం ప‌డుతున్నారు. త‌న వ‌ద్ద‌కు స‌హాయం కావాల‌ని వ‌చ్చేవారికి కాదు.. లేదు.. అన‌కుండా స‌హాయం చేస్తున్నారు. అయితే తీన్మార్ మ‌ల్లన్న ప‌లు కార‌ణాల వ‌ల్ల బీజేపీలో చేరిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం ఈ పార్టీలో కొన‌సాగుతున్నారు. అయితే మ‌రోవైపు 7200 పేరిట ఓ ఉద్య‌మాన్ని ప్రారంభిస్తామ‌ని కూడా చెప్పారు. అందులో భాగంగానే 7200 ఉద్య‌మానికి సంబంధించి ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అస‌లు 7200 అంటే ఏమిటో చెప్పేశారు.

Teenmar Mallanna told what is 7200
Teenmar Mallanna

ఆదివారం జ‌రిగిన తీన్మార్ మ‌ల్ల‌న్న క‌మిటీ మండ‌ల స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మ‌ల్ల‌న్న మాట్లాడారు. 7200 అంటే ఏమిటో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌లు మోసం చేసిన‌, అవినీతికి పాల్ప‌డిన నాయ‌కుల జాబితానే అద‌ని అన్నారు. అంటే రాష్ట్రంలో ఆ విధంగా చేసిన వారి సంఖ్య 7200 వ‌ర‌కు ఉంద‌ని తెలిపారు. వీరందరూ ప్ర‌జ‌ల రక్తాన్ని ప‌ట్టి పీలుస్తున్న జ‌ల‌గ‌లు అని అన్నారు.

ఇక 7200 ఉద్య‌మంలో భాగంగా ఆయన 3 ప్ర‌ధాన అంశాల‌ను తెర‌మీద‌కు తెచ్చారు. ఒక విద్య, రెండు వైద్యం, మూడు స‌త్వ‌ర న్యాయం. ఈ మూడింటికీ ప్ర‌జ‌ల‌కు డ‌బ్బుల‌ను అధికంగా ఖ‌ర్చు పెడుతున్నార‌ని.. క‌నుక ప్ర‌జ‌ల‌కు ఇవి మూడూ ఉచితంగా అందితే అప్పుడు వారు వృద్ధిలోకి వ‌స్తార‌ని.. క‌నుక ఈ మూడు అంశాల కోస‌మే 7200 ఉద్య‌మం ద్వారా పోరాటం చేస్తామ‌ని తెలిపారు. 7200లో అవినీతి, మోస‌పూరిత నాయ‌కుల సంఖ్య 0 అయ్యే వ‌ర‌కు విశ్రాంతి లేద‌ని.. మ‌రో వారం రోజుల్లో ఉద్య‌మాన్ని ప్రారంభిస్తామ‌ని.. అంత‌క‌న్నా ముందే త‌న‌కు, త‌న భార్య‌, పిల్ల‌ల‌కు ఉన్న ఆస్తిని ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తాన‌ని.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌ను ప్రారంభిస్తాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే తీన్మార్ మ‌ల్ల‌న్న 7200 అంటే ఏమిటో ఎట్ట‌కేల‌కు చెప్పేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now