Teenmar Mallanna : ఫ్లాష్ న్యూస్‌.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బెయిల్‌.. నేడే విడుద‌ల‌..

November 8, 2021 1:40 PM

Teenmar Mallanna : ఓ జ్యోతిష్యున్ని డ‌బ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో క్యూ న్యూస్ అధినేత‌, జ‌ర్న‌లిస్టు తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయ‌గా.. ఆయ‌న గ‌త 2 నెల‌లుగా జైలులో ఉన్నారు. అయితే ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. హైకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయ‌న జైలు నుంచి విడుద‌ల కానున్నారు.

Teenmar Mallanna got bail he may be released soon

ఓ కేసులో అరెస్టు అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు అందుబాటులో బెయిల్ ల‌భించినా.. ఆయ‌న మీద వరుస‌గా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆయ‌న ఒక్కో కేసులో బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే 2 నెల‌లుగా జైలులో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఎట్ట‌కేల‌కు చివ‌రి కేసుకు కూడా బెయిల్ రావ‌డంతో విడుద‌ల కానున్నారు. సోమ‌వారం సాయంత్రం ఆయ‌న జైలు నుంచి విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే జైలులో ఉన్న‌ప్పుడే మ‌ల్ల‌న్న బీజేపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌మ భ‌ర్త‌ను ర‌క్షించాల‌ని కోరుతూ ఆయ‌న భార్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ క్ర‌మంలోనే హుజురాబాద్ ఎన్నిక‌లు అయిపోయే వ‌ర‌కు మ‌ల్ల‌న్న‌ను కావాల‌నే జైలులో ఉంచార‌ని బీజేపీ నేత‌ల‌తోపాటు అటు జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జా సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే హుజురాబాద్ ఎన్నిక‌లు అయ్యాక ఆయ‌న‌పై కొత్త కేసులేవీ పెట్టలేదు. దీంతో ఉన్న కేసుల‌కు బెయిల్ క్లియ‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే మ‌ల్ల‌న్న విడుద‌ల కానున్నారు. ఆయ‌న విడుద‌ల‌వుంతుండ‌డంతో ఆయ‌న అభిమానుల్లో హార్షాతిరేకాలు నెల‌కొంటున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now