Team India : వెస్టిండీస్‌తో 3 వ‌న్డేలు, 3 టీ20ల సిరీస్‌లు.. భార‌త జ‌ట్టు ఇదే..!

Team India : సౌతాఫ్రికా చేతిలో ఇటీవ‌ల ఘోర ప‌రాభ‌వం ఎదుర్కొన్న భార‌త క్రికెట్ జ‌ట్టు సొంత దేశంలో వెస్టిండీస్‌తో రెండు సిరీస్‌లకు సిద్ధ‌మ‌వుతోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ తొడ కండ‌రాల గాయంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. అయితే రోహిత్ మ‌ళ్లీ టీమ్‌లోకి వ‌చ్చేశాడు. వెస్టిండీస్‌తో భార‌త్ ఆడ‌నున్న 3 వ‌న్డేలు, 3 టీ20ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్ నుంచి భార‌త్‌కు పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఇక విండీస్‌తో జ‌ర‌గ‌నున్న రెండు సిరీస్‌ల‌కు బీసీసీఐ వేర్వేరుగా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. రెండు ఫార్మాట్‌ల‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. సౌతాఫ్రికా చేతిలో 0-3 తో వైట్ వాష్‌కు గురైన టీమిండియా మ‌ళ్లీ పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌ట్టులో ప‌లు కీల‌క‌మార్పులు చేశారు. కుల్‌దీప్ యాద‌వ్ మ‌ళ్లీ వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను వ‌న్డే జ‌ట్టు నుంచి త‌ప్పించారు. అలాగే యువ లెగ్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్‌కు జ‌ట్టులో చోటు క‌ల్పించారు.

ఈ సిరీస్‌కు జ‌స్‌ప్రిత్ బుమ్రా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీల‌కు రెస్ట్ ఇచ్చిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. అలాగే కేఎల్ రాహుల్ 2వ వ‌న్డే నుంచి అందుబాటులో ఉంటాడ‌ని తెలియ‌జేసింది. ఇక ర‌వీంద్ర జ‌డేజా మోకాలి గాయం కార‌ణంగా ఈ సిరీస్‌ల‌కు దూర‌మ‌య్యాడు. టీ20ల‌కు అక్ష‌ర్ ప‌టేల్ అందుబాటులో ఉండ‌నున్నాడు.

వెస్టిండీస్ భార‌త్ టూర్‌లో భాగంగా మొత్తం 3 వ‌న్డేలు, 3 టీ20ల‌ను ఆడుతుంది. వ‌న్డేల‌ను అహ్మ‌దాబాద్ స్టేడియంలో నిర్వ‌హిస్తారు. కోల్‌క‌తాలో టీ20 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌నున్న భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, దీప‌క్ హుడా, రిష‌బ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), దీప‌క్ చాహ‌ర్‌, శార్దూల్ ఠాకూర్‌, య‌జువేంద్ర చాహ‌ల్, కుల్‌దీప్ యాద‌వ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ర‌వి బిష్ణోయ్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిధ్ కృష్ణ‌, అవేష్ ఖాన్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడ‌నున్న భార‌త జ‌ట్టు..

రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్య‌ర్‌, సూర్య కుమార్ యాద‌వ్‌, రిష‌బ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), వెంక‌టేష్ అయ్య‌ర్‌, దీప‌క్ చాహ‌ర్‌, శార్దూల్ ఠాకూర్‌, ర‌వి బిష్ణోయ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, య‌జువేంద్ర చాహ‌ల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, అవేష్ ఖాన్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌.

కాగా ఫిబ్ర‌వ‌రి 6న భార‌త్‌, విండీస్‌ల మ‌ధ్య మొద‌టి వ‌న్డే జ‌రుగుతుంది. త‌రువాత ఫిబ్ర‌వ‌రి 9, 11 తేదీల్లో మిగిలిన రెండు వ‌న్డేలు జ‌రుగుతాయి. అలాగే ఫిబ్ర‌వ‌రి 16, 18, 20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM