Taraka Ratna Family : నందమూరి తారకరత్న ప్రస్తుతం గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కొందరు తారకరత్నకు సంబంధించిన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న లవ్ స్టోరీ సినిమాలని మించిన ట్విస్ట్‌లతో సాగిందట. 2012లో తారకరత్న పెద్దలను ఎదిరించి అలేఖ్య రెడ్డిని వివాహం ప్రేమ వివాహం చేసుకున్నారు.
గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో అలేఖ్య రెడ్డిని తమ వివాహం గురించి వెల్లడించారు. తారకరత్న చెన్నైలో తన సోదరికి స్కూల్ లో ఆమెకి సీనియర్ అని చెప్పింది.. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా తాము హైదరాబాద్ లో కలిశామని అన్నారు. వాస్తవానికి మేము మొదట మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం కానీ ఆ తర్వాత.. తారక రత్న మొదట ప్రపోజ్ చేయగా, అప్పుడు నేను మా పేరంట్స్‌తో మాట్లాడమని సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేకపోవడమే అని ఆమె చెప్పింది.
మరో వైపు నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. దానికి గల కారణాల్ని కూడా అలేఖ్య రెడ్డి వివరించారు. ‘‘తారక రత్న ఫ్యామిలీ కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదు. దానికి కారణం.. నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా. మళ్లీ పెళ్లి చేసుకుంటానని అసలు అనుకోలేదు. ఆ సమయంలో మా అంకుల్ విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిలవడంతో మేము 2012, ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నాం. ఈ వివాహానికి ఇరు వైపు పెద్దలు ఎవరూ రాలేదు అని చెప్పింది అలేఖ్య. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి.తారక రత్న, అలేఖ్య రెడ్డికి 2013లో నిష్కా అనే పాప పుట్టింది. ప్రస్తుతం వారు సంతోషంగానే ఉన్నారు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…