Almonds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో నట్స్ కూడా ఒకటి. నట్స్ అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి జీడిపప్పు, బాదంపప్పు. అయితే జీడిపప్పు కన్నా బాదంపప్పులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. జీడిపప్పు వల్ల బరువు పెరుగుతారు. కానీ బాదం పప్పు అలా కాదు. బరువు తగ్గించడంతోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోజుకు కేవలం 4 బాదం పప్పులను తిన్నా చాలు.. అద్భుతమైన లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులను 4 తీసుకుని నీటిలో నానబెట్టి తరువాత పొట్టు తీసి తినాలి. ఇలా రోజూ తింటుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బాదంపప్పులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పును తినడం వల్ల విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మం, గోర్లు, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పగులుతున్న వారు, గోర్లు విరిగిపోతున్నవారు లేదా శిరోజాల సమస్యలు ఉన్నవారు రోజూ బాదం పప్పును తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. అలాగే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇలా లాభాలను పొందవచ్చు. ఇక రోజూ బాదం పప్పును తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గలేమని బాధపడుతున్నవారు బాదంపప్పులను తినడం వల్ల చక్కని ఫలితం లభిస్తుంది.
వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన బి విటమిన్లు, మెగ్నిషియం, పొటాషియంతోపాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ మనకు అనారోగ్యాలు రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోజూ బాదం పప్పును తినడం వల్ల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన అమైనో యాసిడ్లు అందుతాయి. ఇవి మన మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. చురుగ్గా మారుస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా ఉంటుంది. అలాగే మతిమరుపు బాధించదు. ఇక చిన్నారుల్లో అయితే మెదడు వికసిస్తుంది. చదువుల్లో రాణిస్తారు. కనుక రోజూ తప్పక బాదం పప్పులను తినాల్సి ఉంటుంది.
బాదంపప్పులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే మెదడు యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తుంది. బాదంపప్పును తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం పని ఒత్తిడి లేదా ఇతర ఆందోళనలతో సతమతం అయ్యేవారు బాదంపప్పులను తినడం వల్ల తప్పక ఫలితం లభిస్తుంది. అలాగే బాదంపప్పును తినడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో కనీసం 5 రోజుల పాటు బాదంపప్పును తింటే హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బాదంపప్పును తినడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రావు. అలాగే బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ గుండెను సంరక్షిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇక బాదంపప్పులో కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండెకు వాటిల్లే ముప్పు తగ్గుతుంది. అలాగే బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ గర్భిణీలకు, వారి కడుపులో ఉండే శిశువులకు ఎంతగానో మేలు చేస్తుంది. కనుక గర్భిణీలు రోజూ బాదంపప్పును తినాలి. ఇలా బాదంపప్పును రోజూ తినడం వల్ల ఎంతో మేలు పొందవచ్చు. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…