Tammareddy Bharadwaja : ఆదిపురుష్ టీజర్ పై తమ్మారెడ్డి సెటైర్లు.. థియేట‌ర్‌లో చూస్తే గెట‌ప్‌లు మారుతాయా..?

October 9, 2022 6:36 PM

Tammareddy Bharadwaja : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్ర‌భాస్ ప్రస్తుతం హీరోగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ పరాజయాల తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ‌ల‌ను నిజం చేస్తూ ఆదిపురుష్ చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. కానీ ఈ టీజ‌ర్ చూసిన అంద‌రూ షాక్ అయ్యారు.

ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే యానిమేషన్ చూస్తున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఆదిపురుష్‌ టీజర్‌పై సోషల్‌ మీడియా మొత్తం ఆదిపురుష్‌ ట్రోల్స్‌, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేనే ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారని దర్శకుడు ఓం రౌత్‌ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను థియేటర్స్ లో విడుదల చేసింది. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్‌ ను కూడా విడుదల చేస్తామని వెల్లడించింది.

Tammareddy Bharadwaja comments on Adipurush movie
Tammareddy Bharadwaja

అయితే తాజాగా ఆదిపురుష్‌ టీజర్, ట్రైలర్‌పై వస్తున్న ట్రోల్స్ పైన ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఆదిపురుష్‌ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఆదిపురుష్‌ ట్రైలర్‌ ను చూశాను. ప్రభాస్‌ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. రూ. 500 కోట్లు బడ్జెట్‌తో బాలీవుడ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై అందరిలోనూ ఫుల్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

కానీ ఈ మూవీ టీజర్ నిరాశ పరిచింది. చూడడానికి యానిమేటెడ్‌ చిత్రంలా ఉంది అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఓ యానిమేటెట్‌ చిత్రాన్ని పెద్ద సినిమా అని ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా 3డీలో థియేటర్స్ లో ఎక్స్‌పీరియన్స్‌ వేరు విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తుంది. నాకు తెలిసినంత వర‌కు 3డీలో చేసిన, 4డీలో చేసిన 2డీలో చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా రజినీకాంత్‌ తీసిన కొచ్చాడియన్‌ యానిమేటెడ్‌ చిత్రంలా తీశారని అందరూ ట్రోల్‌ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గెటప్‌లు, కాస్ట్యూమ్స్‌ మారవు కదా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పూర్తిగా యానిమేటెడ్‌ ప్రభాస్‌ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్‌ వస్తున్నాయి. రాముడిని దేవడిగా కొలిచే మన దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. ఆదిపురుష్ టీమ్ 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే అని భరద్వాజ తెలియజేశారు. సినిమా మంచిగా రావాలనే నెటిజన్స్ ట్రోల్స్‌ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని కాదు. ఆదిపురుష్‌ సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now