Tamannah : సీనియర్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. సమంత 2017లో పెళ్లి చేసుకోగా రీసెంట్‌గా విడాకులు ఇచ్చింది. ఇక కాజల్ అగర్వాల్ గత ఏడాది పెళ్లి చేసుకొని మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని అంటున్నారు. మరో సీనియర్ హీరోయిన్ నయనతార త్వరలోనే విఘ్నేష్ శివన్‌తో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక రకుల్ కూడా ఇటీవలే తన ప్రియుడిని పరిచయం చేసింది. ఈమె పెళ్లి కూడా మరి కొద్ది రోజులలోనే జరగనుంది.
దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తమన్నా సీనియర్ హీరోయిన్‌గా మారింది. ఒకప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ మధ్యలో సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో తమన్నాని పెళ్లి ఎప్పుడు ? అంటూ పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
తమన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుండటం గమనార్హం. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్పిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను.. అంటూ అభిమానుల ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, చిత్ర పరిశ్రమలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.. అంటూ సమాధానం చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. తమన్నా రీసెంట్‌గా సీటీమార్, మాస్ట్రో చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…