Tamannah : వార్త‌ల్లోకి త‌మ‌న్నా పెళ్లి.. ఈ అమ్మడి స‌మాధానం ఏంటి ?

October 26, 2021 9:24 AM

Tamannah : సీనియ‌ర్ హీరోయిన్స్ ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. స‌మంత 2017లో పెళ్లి చేసుకోగా రీసెంట్‌గా విడాకులు ఇచ్చింది. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని మ‌రి కొద్ది రోజుల‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని అంటున్నారు. మరో సీనియ‌ర్ హీరోయిన్ న‌య‌న‌తార త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఇక ర‌కుల్ కూడా ఇటీవ‌లే త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసింది. ఈమె పెళ్లి కూడా మ‌రి కొద్ది రోజుల‌లోనే జ‌ర‌గ‌నుంది.

Tamannah marriage news viral what is her answer

దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త‌మ‌న్నా సీనియ‌ర్ హీరోయిన్‌గా మారింది. ఒకప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ మధ్యలో సరైన అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఈ క్ర‌మంలో త‌మ‌న్నాని పెళ్లి ఎప్పుడు ? అంటూ ప‌లువురు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు.

తమన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుండటం గమనార్హం. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్పిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను.. అంటూ అభిమానుల ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, చిత్ర పరిశ్రమలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.. అంటూ సమాధానం చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. త‌మ‌న్నా రీసెంట్‌గా సీటీమార్, మాస్ట్రో చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment