Tamannaah : క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు న‌న్ను ఆదుకున్న‌ది వారే.. త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

August 13, 2022 11:59 AM

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నాకు వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. హీరోయిన్‌గా అగ్ర హీరోలంద‌రితోనూ జోడీ క‌ట్టిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసింది. ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటోంది.

అయితే.. పదిహేడేళ్ల సినీ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పింది మిల్కీ బ్యూటీ. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ తాత్కాలికమేనని పేర్కొన్నది. తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో వేసే ప్రతి అడుగు ఎంతో ముఖ్యమనదైని తెలిపింది. ఎన్నో పాఠాలను నేర్పుతుందని చెప్పింది. ప్రతి బాల్ సిక్స్ కొట్టాలంటే కుదరదు అన్నది తమన్నా.

Tamannaah said that her family member and friends supported her
Tamannaah

ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎంతోమంది సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విజయమైనా, పరాజయమైనా నటీనటులు ఒక్కరి వల్లే అవ‌దు. హిట్ దక్కిందని ఆనందపడేలోపు పరాజయం పలకరించి బాధపెడుతుంది.. అని తెలిపింది. తన కెరీర్ లో అంతులేని బాధను, ఆవేదనను అనుభవించిన క్షణాలు చాలా ఉన్నాయన్నది తమన్నా. కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ తో ఎత్తుపల్లాల నుంచి బయట పడగలిగానని అంటోంది మిల్క్ బ్యూటీ.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తోంది. వీటితోపాటు బాలీవుడ్ లో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, భోలే చుడియా, ప్లాన్ ఎ ప్లాన్ బి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now