Tamannaah : త‌మ‌న్నా ఏడ్చిందా ? ఎందుకు..?

May 9, 2022 10:48 PM

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు దాదాపుగా 15 ఏళ్ల‌కు పైగా తెలుసు. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఈమె అందం త‌గ్గ‌డం లేదు.. అవ‌కాశాలు కూడా త‌గ్గ‌డం లేదు. హిందీ, తెలుగు, త‌మిళం.. అనే తేడా లేకుండా దాదాపుగా అన్ని భాష‌ల‌కు చెందిన సినిమాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. ఇక ఈమె ఐట‌మ్ సాంగ్స్‌తోనూ మెప్పిస్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రులో బ్యాంగ్ బ్యాంగ్ అంటూ అల‌రించింది. త‌రువాత నితిన్ మ్యాస్ట్రో మూవీలో నెగెటివ్ రోల్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక త్వ‌ర‌లోనే ఎఫ్‌2కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఎఫ్3 మూవీలోనూ ఈమె క‌నిపించి అల‌రించ‌నుంది.

Tamannaah cried on TV show what is the reason
Tamannaah

అయితే ఎల్ల‌ప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండే త‌మ‌న్నా ఏడ్చేసింది. అవును.. నిజ‌మే. ఇంత‌కీ అస‌లు త‌మ‌న్నా ఎందుకు ఏడ్చింది ? దానికి కార‌ణం ఏమిటి ? అనే విష‌యానికి వ‌స్తే.. యాంక‌ర్ సుమ చేస్తున్న అనేక టీవీ షోల‌లో క్యాష్ ప్రోగ్రామ్ ఒక‌టి. ఈ షో తాజాగా 200వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక షో నిర్వ‌హించారు. దీనికి ఎఫ్3 టీమ్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, త‌మ‌న్నా, సోనాల్ చౌహాన్‌, సునీల్‌లు ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యారు.

అయితే షోలో భాగంగా సుమ అంద‌రినీ న‌వ్విస్తూ భ‌లే ఎంట‌ర్‌టైన్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఒక‌రిపై ఒక‌రు పంచ్ డైలాగ్ లు కూడా వేసుకున్నారు. కానీ షోకు చెందిన ప్రోమో చివ‌ర్లో త‌మ‌న్నా ఏడుస్తూ క‌నిపించింది. దీంతో అస‌లు ఏమై ఉంటుందా ? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే అది షోలో భాగ‌మేన‌ని.. ఆమెను ఏదైనా ఏడుపు సీన్‌లో ఎలా ఏడుస్తారు.. అని అడిగితే.. అందుకు ఏడ్చి చూపించి ఉంటుంద‌ని.. తెలుస్తోంది. ఇక ఈ షోలో త‌మ‌న్నా ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలంటే.. షో ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. కాగా త‌మ‌న్నా ఎఫ్3లో వెంకటేష్ ప‌క్క‌న న‌టించింది. ఎఫ్2 లాగే ఈ మూవీ కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైనర్ అని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now