Viral Photo : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ తారలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అమ్మని కౌగిలించుకొని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ఈమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆమె మేని చాయ చూస్తే పాలలో ముంచి తీసిన శిల్పంలా ఉంటుంది. ఆమె డాన్స్ చేస్తూ నడుము వయ్యారింగా తిప్పిందంటే నెలవంక డాన్స్ చేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పటికైనా గుర్తుపట్టారా..
ఆ ఫోటోలో కనిపించే ముద్దులొలికే చిన్నారి ఇంకెవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది తమన్నా. దాదాపు తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించింది ఈ మిల్కీ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తమన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇటీవల కాలంలో తమన్నా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది.
ముంబయిలో పుట్టిన తమన్నా అక్కడే చదువు పూర్తి చేసింది. 2005లో 15 సంవత్సరాల వయస్సులోనే హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో లీడ్ రోల్ వెండి తెరపైకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో తెలుగు చలనచిత్రసీమకు రంగప్రవేశం చేసింది. కానీ శ్రీ మూవీ ప్లాఫ్ కావడంతో తమన్నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ లో ఓ హీరోయిన్ గా చేసిన తమన్నాకు బాగా క్రేజ్ వచ్చింది. కానీ ఆ తరువాత కూడా అడపాదడపా చిన్న సినిమాలు చేసింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన 100 % లవ్ చిత్రంతో తమన్నా దశ తిరిగిపోయింది.
అప్పటి వరకు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తమన్నా.. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో బద్రీనాథ్, రామ్ చరణ్ తో రచ్చ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలందరితోనూ దాదాపు కలిసి నటించింది. ప్రస్తుతం కథానాయికగా మాత్రమే కాకుండా నెగిటివ్ రోల్స్, వెబ్ సిరీసులు కూడా చేస్తూ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం చిత్రాలతో తమన్నా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే తమన్నా ప్రస్తుతం తన లేటెస్ట్ ఫోటోలతో రెచ్చగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…