Tamanna : వివాదాల‌లో నిలుస్తున్న త‌మ‌న్నా.. మ‌ళ్లీ ఏమైంది..?

April 9, 2022 8:06 AM

Tamanna : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో నానా ర‌చ్చ చేస్తోంది. దాదాపు 17 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లోనూ సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోన్న త‌మ‌న్నా త్వ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్క‌నుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే త‌మ‌న్నా రీసెంట్ గా సీటీమార్ చిత్రంలో న‌టించ‌గా.. ఈ సినిమా విషయానికి వస్తే.. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10, 2021న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా 600 వరకు థియేటర్‌‌ల‌లో తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయింది.

Tamanna yet again in another controversy what happened
Tamanna

త‌మ‌న్నా న‌టించిన ఎఫ్ 3 చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. అయితే హీరోయిన్ తమన్నాకు, ఎఫ్ 3 యూనిట్ కు మధ్య గట్టి గొడవ జరిగిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆమె డేట్ లు కేటాయించడం, షూటింగ్ కు రావడం వంటి విషయాల్లో అంత స్పష్టత ఉండదని, బాగా ఆల‌స్యం చేస్తూ ఉంటుందని వినిపిస్తూనే ఉంది. ఈ విషయంలోనే ఎఫ్ 3 సెట్ లో కొన్ని వారాల క్రితం చిన్న గడబిడ అయిందని స‌మాచారం. అది చిలికి చిలికి గాలివానగా మారి నిర్మాత దిల్ రాజు యూనిట్ కు, తమన్నాకు మధ్య వివాదం బిగుసుకుపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదృష్టం కొద్దీ సినిమా వర్క్ పూర్తయిపోయింది.

సినిమాకి సంబంధించి టోటల్ టీమ్ తో ఒక ప్రమోషనల్ సాంగ్ ప్లానింగ్ ఉంది. అది అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేయాల్సి ఉంది. మరి తమన్నా ఈ సాంగ్ కు హాజరవుతుందో లేదో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఈ పాటను పక్కన పెట్టి, వేరే ప్రత్యేక గీతం ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇదిలే ఉండ‌గా త‌మ‌న్నా ఇటీవ‌ల మాస్ట‌ర్ చెఫ్ అనే కార్య‌క్ర‌మానికి హోస్ట్ గా చేయ‌గా, ఈ షో విష‌యంలో కూడా త‌మ‌న్నాకి, నిర్వాహ‌కుల మ‌ధ్య ప‌లు వివాదాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇక తాజా గొడ‌వ‌తో మ‌రోమారు త‌మన్నా పేరు వార్త‌ల్లో నిలిచింది. మ‌రి ఇప్పుడు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now