Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. శ్రీ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగమ్ము హ్యాపీ డేస్‌తో తొలి హిట్ కొట్టింది. ఇక అప్పటి నుండి దూసుకుపోతోంది. సినిమాలతోపాటు డిజిటల్ మాధ్యమంలో సందడి చేసిన మిల్కీబ్యూటీ రీసెంట్‌గా బుల్లితెరపై ‘మాస్టర్ చెఫ్’ అనే కార్యక్రమం తెలుగు వెర్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
రేటింగ్స్ సరిగా రాని క్రమంలో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ నుంచి తమన్నాను పక్కకు పెట్టేసి స్టార్ యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్‌ను రీప్లేస్ చేసేశారు. అయితే ఈ విషయంలో తమన్నా పెద్దగా బాధపడలేదు. కానీ ఇస్తామన్న రెమ్యునరేషన్‌ను ఇవ్వకుండా సదరు ఛానల్ ప్రోగ్రామ్ నిర్వాహకులు మీన మేషాలు లెక్కిస్తున్నారట. దీంతో తమన్నా ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపిందట.
తాజాగా యాజమాన్యం ఈ ఇష్యూపై స్పందించింది. తమన్నాని హోస్ట్‌గా అనుకున్నప్పుడు రూ.2 కోట్లు అగ్రిమెంట్ చేసుకున్నాం. జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె సైన్ చేశారు. కానీ ఆమెకున్న కమిట్‌మెంట్స్ వల్ల కమిటయిన 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్‌కు హాజరయ్యారు. మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్‌కు రాలేదు. అప్పటికే రూ. 1.56 లక్షలు పేమెంట్స్ ఇచ్చేశాము.
తమన్నా రెండు రోజులు రాకపోవడంతో దాదాపుగా 300 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌కు రూ. 5 కోట్లకు పైగానే నష్టం వచ్చింది. అగ్రిమెంట్ చేసుకున్నదాని ప్రకారం ఆమె రెండు రోజులు వచ్చి ఉంటే బ్యాలెన్స్ రూ. 50 లక్షల పేమెంట్ కూడా చేసేవాళ్ళము. కానీ అది పూర్తి చేయకుండానే..సెకండ్ సీజన్‌కు అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేస్తోంది.. అని యాజమాన్యం అన్నారు. దీనిపై తమన్నా స్పందిస్తుందా.. అనేది చూడాలి.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…