Tamanna : త‌మ‌న్నా మ‌మ్మ‌ల్ని మోసం చేసింది.. ఆమె వ‌ల‌న రూ.5 కోట్లు న‌ష్ట‌పోయాం..!

October 27, 2021 2:50 PM

Tamanna : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. శ్రీ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగ‌మ్ము హ్యాపీ డేస్‌తో తొలి హిట్ కొట్టింది. ఇక అప్ప‌టి నుండి దూసుకుపోతోంది. సినిమాల‌తోపాటు డిజిట‌ల్ మాధ్య‌మంలో సంద‌డి చేసిన మిల్కీబ్యూటీ రీసెంట్‌గా బుల్లితెర‌పై ‘మాస్ట‌ర్ చెఫ్‌’ అనే కార్య‌క్ర‌మం తెలుగు వెర్ష‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించింది.

Tamanna cheated us we lost rs 5 crores says master chef organizers

రేటింగ్స్ స‌రిగా రాని క్రమంలో మాస్ట‌ర్ చెఫ్ ప్రోగ్రామ్ నుంచి త‌మ‌న్నాను ప‌క్క‌కు పెట్టేసి స్టార్ యాంక‌ర్ అయిన అన‌సూయ భ‌రద్వాజ్‌ను రీప్లేస్ చేసేశారు. అయితే ఈ విష‌యంలో తమ‌న్నా పెద్ద‌గా బాధ‌ప‌డ‌లేదు. కానీ ఇస్తామ‌న్న రెమ్యున‌రేష‌న్‌ను ఇవ్వ‌కుండా స‌ద‌రు ఛానల్ ప్రోగ్రామ్ నిర్వాహ‌కులు మీన మేషాలు లెక్కిస్తున్నార‌ట‌. దీంతో త‌మ‌న్నా ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపిందట.

తాజాగా యాజ‌మాన్యం ఈ ఇష్యూపై స్పందించింది. త‌మ‌న్నాని హోస్ట్‌గా అనుకున్న‌ప్పుడు రూ.2 కోట్లు అగ్రిమెంట్ చేసుకున్నాం. జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె సైన్ చేశారు. కానీ ఆమెకున్న కమిట్‌మెంట్స్ వల్ల కమిటయిన 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్‌కు హాజరయ్యారు. మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్‌కు రాలేదు. అప్పటికే రూ. 1.56 లక్షలు పేమెంట్స్ ఇచ్చేశాము.

త‌మ‌న్నా రెండు రోజులు రాక‌పోవ‌డంతో దాదాపుగా 300 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌కు రూ. 5 కోట్లకు పైగానే నష్టం వచ్చింది. అగ్రిమెంట్ చేసుకున్నదాని ప్రకారం ఆమె రెండు రోజులు వ‌చ్చి ఉంటే బ్యాలెన్స్ రూ. 50 లక్షల పేమెంట్ కూడా చేసేవాళ్ళము. కానీ అది పూర్తి చేయకుండానే..సెకండ్ సీజన్‌కు అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేస్తోంది.. అని యాజ‌మాన్యం అన్నారు. దీనిపై త‌మ‌న్నా స్పందిస్తుందా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment