Heart Attack : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

August 12, 2022 8:21 PM

Heart Attack : మ‌న శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె.  మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తూ అలుపెరుగని యోధుడిలా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో గుండె దాదాపుగా 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మారుతున్న జీవన శైలిని బట్టి అతి చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

అధిక బరువుతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు లోనవుతున్నారు. గుండె పదిలంగా ఉండాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే వాటిలో డ్రై ఫ్రూట్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో డ్రైఫ్రూట్స్ వాడకం కూడా బాగానే పెరిగింది. గుండె ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎలాంటి పాత్రను పోషిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take these 3 types of nuts daily to prevent Heart Attack
Heart Attack

రోజుకు మూడు పిస్తా పప్పులు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. పిస్తా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా అధిక బరువు సమస్యలను కూడా తగ్గిస్తాయి. రోజుకు 6 బాదం పప్పుల‌ను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నిత్యం బాదం పప్పు తినడం వలన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెను కాపాడుతాయి.

బాదం, పిస్తాతో పాటు వాల్ నట్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెరిగేలా చేస్తాయి. అందువలన వాల్ నట్స్ అనేవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజుకు 6 వాల్ నట్స్ ను మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. అంతే కాకుండా అధిక బరువు, డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ మూడు ర‌కాల‌ డ్రై ఫ్రూట్స్ ను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now