Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

September 30, 2022 7:58 AM

Dried Strawberry : ప్రస్తుత కాలంలో అనేక మహమ్మారి వైరస్ లు మనిషి మనుగడను అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే మార్పుల వలన కావచ్చు.. మనుషులు చేసే తప్పిదాల వలన కావచ్చు.. అనేక రకాల వైరస్ లు శరీరంలో ప్రవేశించి ప్రాణాలకు ప్రమాదం కలిగే రోగాల బారిన పడే విధంగా అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి. ఎంత భయంకరమైన వైరస్ అయినా సరే మన శరీరంలో ప్రవేశించినా కూడా మన వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వ్యాధినిరోధక శక్తి దృఢంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో శ్రద్ధ వహించడం ఎంతో ఉత్తమం.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అందరూ శరీరంలో యాంటీబాడీస్ అనే పదం వినే ఉంటారు. యాంటీ బాడీస్ అంటే తెల్లరక్తకణాలు. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి వచ్చే వైరస్ మరియు బ్యాక్టీరియాలను తరిమి కొట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరి యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచాలంటే ఏం సపోర్ట్ చేస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

take Dried Strawberry one piece everyday for these benefits
Dried Strawberry

మనం తీసుకునే ఆహారంలో నిత్యం స్ట్రాబెర్రీస్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్ట్రాబెర్రీస్ నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన  రక్షణ వ్యవస్థలో బీ సెల్స్ అనేవి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేయాలి అంటే పోషకాలు కావాలి. 100 గ్రాముల స్ట్రాబెరీస్ లో 50 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా అధిక మోతాదులో ఉంటాయి.

స్ట్రాబెరీలలో సి, కె వంటి విటమిన్లుతోపాటు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి స్ట్రాబెర్రీస్ లో అధికంగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెరీలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను దూరం చేస్తాయి. రక్తసరఫరా సవ్యంగా జరిగి హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి. స్ట్రాబెరీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి గుండెపోటు వంటి ప్రమాదాలను అరికడతాయి.

అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా స్ట్రాబెరీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా నియంత్రిస్తాయి. గర్భిణులు స్ట్రాబెరీ పండ్లను తినడం వలన బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. ఇలా స్ట్రాబెర్రీస్ ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలోని బీ-సెల్స్ ను యాక్టివ్ గా ఉంచి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. నిత్యం మనకు తాజా స్ట్రాబెర్రీస్ అందుబాటులో ఉండవు కాబట్టి బయట డ్రై స్ట్రాబెర్రీస్ కూడా లభిస్తాయి. ఇలా లభించిన డ్రై స్ట్రాబెర్రీస్ ని రోజుకి ఒక ముక్క తింటే చాలు ఉక్కులాంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now