T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు కోసం బంగ్లాదేశ్ తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ విజయం విండీస్‌ను వరించింది. దీంతో బంగ్లాపై విండీస్ కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. నికోలాస్ పూరన్ 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 40 పరుగులు చేయగా.. రోస్టన్ చేజ్ 46 బంతుల్లో 2 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మహెది హసన్, ముస్తాఫిజుర్ రహమాన్, షొరిఫుల్ ఇస్లామ్‌లు తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 5 వికెట్లను కోల్పోయి 139 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో లైటన్ దాస్ 43 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేయగా.. మహ్మదుల్లా 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రవిరాంపాల్, జేసన్ హోల్డర్, ఆండ్రూ రస్సెల్, అకియల్ హొసెయిన్, డ్వానె బ్రేవోలు తలా 1 వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…