T20 World Cup 2021 : నేటి నుంచే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం.. భార‌త్ సెమీఫైన‌ల్ అవ‌కాశాలు పుష్క‌లం..

October 23, 2021 9:42 AM

T20 World Cup 2021 : ఐపీఎల్ 2021 వేడి ఇంకా ముగియ‌నేలేదు.. చ‌లికాలంలో క్రికెట్ అభిమానుల‌ను వినోదాన్ని పంచేందుకు ఇంకో మెగా టోర్నీ సిద్ధ‌మైంది. పొట్టి క్రికెట్ ప్ర‌పంచ కప్ శ‌నివారం నుంచి అల‌రించ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్వాలిఫైర్ మ్యాచ్‌లు జ‌ర‌గ్గా వాటిల్లో విజ‌యం సాధించి టాప్ ప్లేస్‌ల‌లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ 12 గ్రూప్‌ల‌లో చేరాయి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నుంచి అస‌లు స‌మ‌రం ప్రారంభం కానుంది. ప్ర‌ధాన జ‌ట్ల మ‌ధ్య పోటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో మ‌ళ్లీ క్రికెట్ అభిమానుల‌కు ఇంకో 22 రోజుల పాటు అద్భుత‌మైన వినోదం ల‌భించ‌నుంది.

T20 World Cup 2021 starts from today india definitely go to semi finals

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 మెగా టోర్నీలో శుక్ర‌వారం వ‌ర‌కు క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లు జ‌రిగాయి. శ‌నివారం నుంచి ప్ర‌ధాన జ‌ట్ల మ‌ధ్య అస‌లు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు అబుధాబిలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అలాగే ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ల మ‌ధ్య రాత్రి 7.30 గంట‌ల‌కు దుబాయ్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌ల‌లో ఆడే జ‌ట్లు సూప‌ర్ 12 లో గ్రూప్ 1లో ఉన్నాయి.

ఆదివారం మ‌రో రెండు మ్యాచ్‌లు జ‌రుగుతాయి. సూప‌ర్ 12 గ్రూప్ 1లో ఉన్న శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్ ల మ‌ధ్య‌, అలాగే సూప‌ర్ 12 గ్రూప్ 2లో ఉన్న భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య‌.. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌లు, రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

కాగా ఈ టోర్నీలో భార‌త్.. పాకిస్థాన్‌తోపాటు.. న్యూజిలాండ్‌, ఆఫ్గ‌నిస్థాన్‌, స్కాట్లండ్‌, న‌మీబియా జ‌ట్ల‌తో మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. అక్టోబ‌ర్ 24న పాకిస్థాన్‌, 31న న్యూజిలాండ్‌, నవంబ‌ర్ 3న ఆప్ఘ‌నిస్థాన్‌, 5వ తేదీన స్కాట్లండ్‌, 8న న‌మీబియా జ‌ట్ల‌తో ఆడుతుంది.

సూప‌ర్ 12 గ్రూప్ 1లో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, శ్రీ‌లంక‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జ‌ట్లు ఉండ‌గా.. గ్రూప్ 2లో ఆప్ఘ‌నిస్థాన్‌, స్కాట్లండ్‌, ఇండియా, న‌మీబియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌.. జ‌ట్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో గ్రూప్ 2లో భార‌త్‌, న్యూజిలాండ్‌ల‌కు సెమీఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గ్రూప్ 1లో హేమాహేమీ జ‌ట్లు ఉన్నాయి క‌నుక అందులో వారికి సెమీఫైన‌ల్ బెర్త్‌ల కోసం ట‌ఫ్ ఫైట్ జ‌రుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021లో ఆడ‌నున్న భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ (వైస్ కెప్టెన్‌), సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్‌, ఇషాన్ కిష‌న్‌, శార్దూల్ ఠాకూర్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, రాహుల్ చాహ‌ర్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now