T20 World Cup 2021 : షార్జా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 25వ మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా కష్టపడి ఛేదించింది. దీంతో లంక జట్టుపై సఫారీలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో పతుమ్ నిస్సంక 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి ఆకట్టుకోగా.. చరిత అసలంక 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్ శంషీ, డ్వానె ప్రిటోరియస్‌లు చెరో 3 వికెట్లను పడగొట్టగా అన్‌రిక్ నోర్‌జె 2 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లను కోల్పోయి 146 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో టెంబా బవుమా 46 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్ 13 బంతుల్లో 2 సిక్సర్‌లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. లంక బౌలర్లలో వనిందు హసరంగ డిసిల్వ 3 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ దుష్మంత చమీర 2 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…