T20 World Cup 2021 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ జెర్సీలో త‌ళుక్కుమ‌న్న ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఫొటో వైర‌ల్‌..!

October 18, 2021 3:48 PM

T20 World Cup 2021 : భార‌త క్రికెట్ జట్టు వెట‌ర‌న్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియాలో నూత‌న జెర్సీ ధ‌రించి ఉన్న త‌న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం బీసీసీఐ ఇటీవ‌లే భార‌త జ‌ట్టు కోసం నూత‌న జెర్సీల‌ను ఆవిష్క‌రించింది. ఆ జెర్సీలోనే అశ్విన్ త‌ళుక్కుమ‌న్నాడు. కాగా అశ్విన్ పోస్ట్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

T20 World Cup 2021 ravichandran ashwin in new indian jersey

ఇక త‌న‌ను ఆ జెర్సీలో చూసిన అశ్విన్ కుమార్తె.. గ‌తంలో ఎన్న‌డూ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు చెందిన జెర్సీని ధ‌రించి ఉన్న‌ప్పుడు చూడ‌లేద‌ని త‌న తండ్రితో చెప్పింది. అయితే అది నిజ‌మే. అశ్విన్ దాదాపుగా 4 ఏళ్ల నుంచి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ఆడ‌లేదు. త‌న సొంత జ‌ట్టు త‌మిళ‌నాడుతోపాటు ఐపీఎల్ లో అత‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడుతున్నాడు. అయితే అనేక సార్లు చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ అశ్విన్‌కు టెస్టు జ‌ట్టులో చోటు క‌ల్పించారు. కానీ టీ20, వ‌న్డేల్లో అవ‌కాశం ఇవ్వలేదు. కానీ ఎట్ట‌కేల‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు తుది జ‌ట్టులో అశ్విన్‌కు చోటు ద‌క్కింది. దీంతో అత‌ను ఈ టోర్నీలో కీల‌కంగా మారాడు.

https://www.instagram.com/p/CVIEroJMDNp/?utm_source=ig_embed&ig_rid=546f477b-40db-4d90-8858-916ea4a63826

కాగా అశ్విన్ పోస్ట్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా కాగా ఇప్ప‌టికే దానికి 4 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. అత‌ను టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడుతుండ‌డంతో ఎంతో సంతోషంగా ఫీల‌వుతున్నాడు. కాగా భార‌త్ ఈ టోర్నీలో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్ తో ఆడ‌నుంది. ఈ నెల 31వ తేదీన న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్ ఆడుతుంది. అంత‌కు ముందుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల‌తో భార‌త్ రెండు వార్మ‌ప్ గేమ్‌ల‌ను ఆడ‌నుంది.

ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు గాను భార‌త జ‌ట్టు ఇలా ఉంది. విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, సూర్య కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌, రిష‌బ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, శార్దూల్ ఠాకూర్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, రాహుల్ చాహ‌ర్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రా. శ్రేయాస్ అయ్య‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, దీప‌క్ చాహ‌ర్‌ల‌ను రిజ‌ర్వ్ లో ఉంచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now