T20 World Cup 2021 : షార్జాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 41వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై పాకిస్థాన్ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని స్కాట్లండ్ ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో స్కాట్లండ్‌పై పాక్ 72 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజం, షోయబ్ మాలిక్‌లు అర్థ సెంచరీలతో చెలరేగిపోయారు. 47 బంతుల్లో అజం 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, మాలిక్ 18 బంతుల్లోనూ 1 ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్కాట్లండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు తీయగా, హంజా తాహిర్, సఫ్‌యాన్ షరీఫ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో రిచీ బెరింగ్‌టన్ మాత్రమే రాణించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీయగా, షాహీన్ షా అఫ్రిది , హారిస్ రౌఫ్, హసన్ అలీలు తలా 1 వికెట్ తీశారు.
కాగా మొదటి రౌండ్ మ్యాచ్‌లు ముగియడంతో సెమీస్ వెళ్లే జట్లు ఖరారయ్యాయి. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు సెమీస్‌కు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన మొదటి సెమీఫైనల్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అబుధాబిలో జరగనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్ ఈ నెల 11వ తేదీన పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్‌లో జరగనుంది. నవంబర్ 14న దుబాయ్ లోనే ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇక భారత్ సోమవారం నమీబియాతో తలపడనుంది. అందులో విజయం సాధించినా ప్రభావం ఏమీ ఉండదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…