T20 World Cup 2021 : పాకిస్థాన్ మ‌ళ్లీ గెలిచింది.. సెమీ ఫైన‌ల్స్‌లో త‌ల‌ప‌డ‌నున్న జ‌ట్లు ఇవే..!

November 7, 2021 11:15 PM

T20 World Cup 2021 : షార్జాలో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 41వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై పాకిస్థాన్ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని స్కాట్లండ్ ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో స్కాట్లండ్‌పై పాక్ 72 ప‌రుగులు భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 pakisthan won by 72 runs against scotland in 41st match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. కెప్టెన్ బాబ‌ర్ అజం, షోయ‌బ్ మాలిక్‌లు అర్థ సెంచ‌రీల‌తో చెల‌రేగిపోయారు. 47 బంతుల్లో అజం 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు చేయ‌గా, మాలిక్ 18 బంతుల్లోనూ 1 ఫోర్, 6 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్కాట్లండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు తీయ‌గా, హంజా తాహిర్‌, స‌ఫ్‌యాన్ ష‌రీఫ్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 117 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో రిచీ బెరింగ్‌ట‌న్ మాత్ర‌మే రాణించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌల‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీయ‌గా, షాహీన్ షా అఫ్రిది , హారిస్ రౌఫ్‌, హ‌స‌న్ అలీలు త‌లా 1 వికెట్ తీశారు.

కాగా మొద‌టి రౌండ్ మ్యాచ్‌లు ముగియ‌డంతో సెమీస్ వెళ్లే జ‌ట్లు ఖ‌రార‌య్యాయి. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లు సెమీస్‌కు వెళ్లాయి. ఈ క్ర‌మంలోనే ఈ నెల 10వ తేదీన మొద‌టి సెమీఫైన‌ల్ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య అబుధాబిలో జ‌ర‌గ‌నుంది. అలాగే రెండో సెమీ ఫైన‌ల్ ఈ నెల 11వ తేదీన పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య దుబాయ్‌లో జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 14న దుబాయ్ లోనే ఫైన‌ల్ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఇక భార‌త్ సోమ‌వారం న‌మీబియాతో త‌ల‌ప‌డ‌నుంది. అందులో విజ‌యం సాధించినా ప్ర‌భావం ఏమీ ఉండ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now