T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 31వ మ్యాచ్ లో పసికూన నమీబియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని చూసినా నమీబియా బెదిరిపోలేదు. పోరాట పటిమను ప్రదర్శించింది. గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 144 పరుగులు చేయగలిగింది. దీంతో నమీబియాపై పాకిస్థాన్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో మహమ్మద్ రిజ్వాన్ 79 పరుగులు, బాబర్ అజం 70 పరుగులు చేసి రాణించారు. మరో బ్యాట్స్‌మన్ మహమ్మద్ హఫీజ్ కూడా 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వెయిస్, జాన్ ఫ్రైలింక్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బ్యాట్స్‌మెన్‌లలో డేవిడ్ వెయిస్ 43 పరుగులు, క్రెయిగ్ విలియమ్స్ 40, స్టీఫన్ బార్డ్ 29 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమాద్ వసీం, హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌లు తలా 1 వికెట్ తీశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…