T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 32వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లండ్ పోరాట పటిమను ప్రదర్శించింది. అయినప్పటికీ ఓటమి తప్పలేదు. దీంతో స్కాట్లండ్‌పై న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్లలో మార్టిన్ గప్తిల్ 93 పరుగులతో చెలరేగిపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ 33 పరుగులు చేసి రాణించాడు. స్కాట్లండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్, సఫ్‌యాన్ షరీఫ్‌లు చెరో 2 వికెట్లు తీయగా, మార్క్ వాట్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో మైకేల్ లియాస్క్ 42 పరుగులు చేసి రాణించాడు. మిగిలిన వారు ఆకట్టుకోలేకపోయారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధిలు చెరో 2 వికెట్లు తీయగా, టిమ్ సౌతీ 1 వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…