T20 World Cup 2021 : స్కాట్లండ్‌పై న్యూజిలాండ్ గెలుపు

November 3, 2021 7:26 PM

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 32వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై న్యూజిలాండ్ విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో స్కాట్లండ్ పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. అయిన‌ప్ప‌టికీ ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో స్కాట్లండ్‌పై న్యూజిలాండ్ 16 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021 newzealand won by 16 runs against scotland in 32nd match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కివీస్ 5 వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట్స్ మెన్ల‌లో మార్టిన్ గ‌ప్తిల్ 93 ప‌రుగుల‌తో చెల‌రేగిపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ 33 ప‌రుగులు చేసి రాణించాడు. స్కాట్లండ్ బౌల‌ర్ల‌లో బ్రాడ్ వీల్‌, స‌ఫ్‌యాన్ ష‌రీఫ్‌లు చెరో 2 వికెట్లు తీయ‌గా, మార్క్ వాట్ ఒక వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో మైకేల్ లియాస్క్ 42 ప‌రుగులు చేసి రాణించాడు. మిగిలిన వారు ఆక‌ట్టుకోలేక‌పోయారు. కివీస్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, ఇష్ సోధిలు చెరో 2 వికెట్లు తీయ‌గా, టిమ్ సౌతీ 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now