T20 World Cup 2021 : దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 16వ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 151 పరుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత్ టాప్ ఆర్డర్ తడబడింది. అయితే కెప్టెన్ కోహ్లి సమయస్ఫూర్తితో ఆడుతూ పంత్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లి 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57 పరుగులు చేయగా.. 30 బంతులు ఆడిన పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరును చేయగలింది.
పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది 3 వికెట్లను తీసి భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హసన్ అలీకి 2 వికెట్లు దక్కాయి. షాదాబ్ ఖాన్, హరిస్ రౌఫ్‌లు చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 152 పరుగులు చేయాల్సి ఉంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…