T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 48 బంతులు ఆడిన విలియమ్సన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజల్‌వుడ్ 3 వికెట్లు తీయగా, ఆడమ్ జంపా 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తోపాటు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ లు చెలరేగిపోయారు. 38 బంతులు ఆడిన వార్నర్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాక్స్‌వెల్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…