T20 World Cup 2021: అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 13వ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. సౌతాఫ్రికా నిర్దేశించిన లక్ష్యం స్వల్పమైనదే అయినప్పటికీ ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడింది. అయినప్పటికీ నిదానంగా ఆడుతూ చివరకు లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 118 పరుగులను మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో మార్కరమ్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. 36 బంతులు ఆడిన మార్కరమ్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హేజల్‌వుడ్, జంపాలు తలా 2 వికెట్లు తీశారు. మాక్స్‌వెల్, కమ్మిన్స్‌కు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మరో బ్యాట్స్‌మన్ మార్కస్ స్టాయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్‌జె 2 వికెట్లు తీయగా, రబాడా, కేశవ్ మహారాజ్, శంషీలు తలా 1 వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…