T20 World Cup 2021: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస్ట్రేలియా బోణీ.. స‌ఫారీల‌పై విజ‌యం..

October 23, 2021 7:17 PM

T20 World Cup 2021: అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 13వ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విజ‌యం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. సౌతాఫ్రికా నిర్దేశించిన ల‌క్ష్యం స్వ‌ల్ప‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా ఆరంభంలో త‌డ‌బ‌డింది. అయిన‌ప్ప‌టికీ నిదానంగా ఆడుతూ చివ‌ర‌కు ల‌క్ష్యాన్ని ఛేదించింది. దీంతో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 australia won by 5 wickets against south africa

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో స‌ఫారీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌ను కోల్పోయి 118 ప‌రుగులను మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల‌లో మార్క‌ర‌మ్ ఒక్క‌డే ఆక‌ట్టుకున్నాడు. 36 బంతులు ఆడిన మార్క‌ర‌మ్ 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 40 ప‌రుగులు చేశాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో స్టార్క్‌, హేజ‌ల్‌వుడ్‌, జంపాలు త‌లా 2 వికెట్లు తీశారు. మాక్స్‌వెల్‌, క‌మ్మిన్స్‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 19.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 3 ఫోర్లతో 35 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు. మరో బ్యాట్స్‌మ‌న్ మార్క‌స్ స్టాయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్ల‌తో 24 ప‌రుగులు చేసి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో నోర్‌జె 2 వికెట్లు తీయ‌గా, ర‌బాడా, కేశ‌వ్ మ‌హారాజ్‌, శంషీలు త‌లా 1 వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now