T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 27వ మ్యాచ్‌లో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది. ఆప్గనిస్థాన్ ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా తడబడింది. పసికూన జట్టు కావడంతో గెలుపొందలేకపోయింది. ఈ క్రమంలో నమీబియాపై ఆఫ్గనిస్థాన్ 62 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్‌లలో మహమ్మద్ షాజాద్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా.. హజ్రతుల్లా జజై 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్ మహమ్మద్ నబీ 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్గర్ ఆఫ్గన్ (31 పరుగులు) కూడా రాణించాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్‌మన్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. జేజే స్మిట్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో డేవిడ్ వియసె 30 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఆఫ్గన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ లు చెరో 3 వికెట్లు తీయగా, గుల్బదీన్ నయీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…