గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : న‌మీబియాపై ఘ‌న విజ‌యం సాధించిన ఆఫ్గ‌నిస్థాన్..!

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 27వ మ్యాచ్‌లో న‌మీబియాపై ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది. ఆప్గ‌నిస్థాన్ ఉంచిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో న‌మీబియా త‌డ‌బ‌డింది. ప‌సికూన జ‌ట్టు…

T20 World Cup 2021 : న‌మీబియాపై ఘ‌న విజ‌యం సాధించిన ఆఫ్గ‌నిస్థాన్..!

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 27వ మ్యాచ్‌లో న‌మీబియాపై ఆఫ్గనిస్థాన్ గెలుపొందింది. ఆప్గ‌నిస్థాన్ ఉంచిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో న‌మీబియా త‌డ‌బ‌డింది. ప‌సికూన జ‌ట్టు కావ‌డంతో గెలుపొంద‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో న‌మీబియాపై ఆఫ్గ‌నిస్థాన్ 62 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 afghanisthan won by 62 runs against namibia in 27th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గ‌నిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. ఆఫ్గ‌న్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మ‌హ‌మ్మ‌ద్ షాజాద్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 45 ప‌రుగులు చేయ‌గా.. హ‌జ్ర‌తుల్లా జ‌జై 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 33 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ‌హ‌మ్మ‌ద్ న‌బీ 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 32 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్గ‌ర్ ఆఫ్గ‌న్ (31 ప‌రుగులు) కూడా రాణించాడు. న‌మీబియా బౌల‌ర్ల‌లో రూబెన్ ట్రంపుల్‌మ‌న్, జాన్ నికోల్ లాఫ్టీ ఈట‌న్‌లు చెరో 2 వికెట్లు తీశారు. జేజే స్మిట్‌ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న‌మీబియా 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 98 ప‌రుగులు మాత్రమే చేసింది. ఈ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో డేవిడ్ వియ‌సె 30 బంతుల్లో 2 ఫోర్ల‌తో 26 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్, హ‌మీద్ హ‌స‌న్ లు చెరో 3 వికెట్లు తీయ‌గా, గుల్బ‌దీన్ న‌యీబ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌షీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి