Swetha Varma : ల‌గ్జ‌రీ బైక్‌ను కొనుగోలు చేసిన‌.. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వ‌ర్మ‌..!

January 28, 2022 6:45 PM

Swetha Varma : బిగ్ బాస్ షోలో పాల్గొన్న‌వారికి ఎన్ని వారాల పాటు అందులో ఉంటే అంత ఎక్కువ డ‌బ్బు వ‌స్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఇక సెల‌బ్రిటీల‌కు అందే మొత్తం ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఎంత లేద‌నుకున్నా.. బిగ్ బాస్ షోలో పాల్గొంటే మాత్రం ల‌క్ష‌ల రూపాయ‌లు పారితోషికంగా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు త‌మ‌కు ల‌భించే ఆ డ‌బ్బుతో త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తుంటారు.

Swetha Varma bought luxurious bike

ఇటీవ‌లే ల‌హరి ఓ ల‌గ్జ‌రీ బైక్‌ను కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. రూ.5 ల‌క్ష‌లు పెట్టి మ‌రీ ఆమె ఆ బైక్‌ను కొన్న‌ది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వ‌ర్మ కూడా ఓ విలాస‌వంత‌మైన బైక్‌ను కొనుగోలు చేసి త‌న క‌ల‌ను నెర‌వేర్చుకుంది.

శ్వేతా వ‌ర్మ తాజాగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన హిమాల‌య‌న్ మోడ‌ల్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. త‌న‌కు బైక్ రైడింగ్ అంటే ఇష్ట‌మ‌ని, అందుక‌నే ఈ బైక్‌ను కొనుగోలు చేశాన‌ని ఆమె తెలిపింది.

కాగా కొత్త బైక్‌ను కొన్నందుకు గాను శ్వేతా వ‌ర్మ‌కు నెటిజ‌న్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈమె బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతోంది. ప‌చ్చీస్‌, ది రోజ్ విల్లా, ఏక‌మ్‌, ముగ్గురు మొన‌గాళ్లు, మిఠాయి, మ్యాడ్‌, గ్యాంగ్ ఆఫ్ గ‌బ్బ‌ర్ సింగ్‌, సంజీవ‌ని, నెగెటివ్ వంటి చిత్రాల్లో న‌టించింది. త్వ‌ర‌లో మ‌రిన్ని చిత్రాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇక కీర్తి సురేష్ న‌టించిన గుడ్ ల‌క్ స‌ఖి చిత్రంలోనూ శ్వేతా వ‌ర్మ ఓ పాత్ర‌లో న‌టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now