Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా జై భీమ్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. సినతల్లిగా నటి లిజోమోల్ యాక్ట్ చేశారు. ఈమె పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ జై భీమ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
పోలీస్ కస్టడీలో లాకప్ డెత్ లో చనిపోయిన వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆయన భార్య చేసిన న్యాయ పోరాటమే ఈ కథ నేపథ్యం. ఈ సినిమా తెలుగు, తమిళం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెలెబ్రిటీలతోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్.. జై భీమ్ సినిమా డైరెక్టర్ ను ఎంతగానో పొగిడారు. అలాగే సూర్యకు అభినందనలు తెలియజేస్తూ.. లెటర్ కూడా రాశారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం రియల్ సినతల్లి అయిన పార్వతి అమ్మాళ్ కు హీరో సూర్య 10 లక్షల రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతినెల పార్వతి అమ్మాళ్ కు అందేలా చేశారు. ఈ విషయాన్ని సూర్య తన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అలాగే ఇటీవల పార్వతి అమ్మాళ్ కుటుంబానికి అండగా నిలబడి, ఆమెకు ఇల్లు కట్టిస్తానని కోలీవుడ్ హీరో, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…