Surender Reddy : కిక్, రేసు గుర్రం,సైరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో నటుడి సరికొత్త కోణాన్ని చూపిస్తానని సురేందర్ రెడ్డి అభిమానులకు హామీ ఇచ్చారు. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. థమన్ స్వరాలు సమకూర్చనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. షూటింగ్ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలే కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు సమచారం. వారంతా క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని, మిగతా చిత్ర బృందం హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా వదిలారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్.. అంటూ ఓ పోస్టర్‌ను ప్రకటించారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…