Surekha Vani : టాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్క, అత్త, అమ్మ ఇలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులని అలరించింది. మూడేళ్ల క్రితం సురేఖా వాణి భర్త చనిపోవడంతో ప్రస్తుతం కూతురు సుప్రితతో కలిసి ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండటంతోపాటు.. పొట్టి పొట్టి డ్రెస్‌లతో కూతురికి పోటీగా నిలుస్తున్న సురేఖా వాణి హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మడు పొట్టి దుస్తులలో చేసే రచ్చ.. కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే కొన్నాళ్లుగా సురేఖ మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి.
ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుప్రీత తన తల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడింది. తనకైతే రెండో పెళ్లి చేయాలనే ఉందని చెప్పుకొచ్చింది. ఏం జరుగుతుందో అన్నది టైం డిసైడ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం తన కెరీర్ పైన అమ్మ ఫోకస్ చేసిందని, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నామని వెల్లడించింది. ఇక వీలున్నప్పుడల్లా విహార యాత్రలకు వెళుతూ అక్కడ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందిస్తూ వస్తున్నారు తల్లీ కూతుళ్లు.
కరోనా వల్ల కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన సురేఖ, సుప్రీత తాజాగా బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తోంది. బిజినెస్ క్లాస్‌లో మందు తాగుతూ, బ్యాంకాక్‌లో మసాజ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం వీరి పిక్స్‌పై నెటిజన్స్ బిన్నరకాలుగా స్పందిస్తున్నారు. సుప్రీతని హీరోయిన్‌గా చేయాలని సురేఖ కోరిక కాగా, అది ఎప్పుడు తీరుతుందో అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది సుప్రీత. వారు ఏ ఫొటో షేర్ చేసినా అది కొద్ది నిమిషాలలోనే నెట్టింట వైరల్ అవుతుంటుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…