Sneha Reddy : సోషల్ మీడియాలో ఏ హీరో భార్యకు లేని ఫాలోవర్లు.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఉన్నారు. ఆమె హీరోయిన్లకు సమానంగా సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు ఆమె సోషల్ ఖాతాల్లో అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు వెకేషన్‌కు వెళ్లినా అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తుంటారు. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించారు. లైవ్‌లోకి వచ్చిన ఆమె తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక వాటిల్లో ఒక ఆసక్తికరమైన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే..
అల్లు అర్జున్ కు ఇష్టమైన ఫుడ్ ఏదని ఒక నెటిజన్ అడగ్గా.. అందుకు స్నేహా రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయనకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ అని బదులు చెప్పారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటి పార్ట్‌కు విశేషమైన ఆదరణ లభించడం.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడం.. కేజీఎఫ్ 2 విడుదల.. వంటి అంశాల వల్ల పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకని సుకుమార్ స్క్రిప్ట్‌ను చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నారని.. అందుకనే షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇక మొదటి పార్ట్‌లో నటించిన వారందరూ రెండో పార్ట్‌లోనూ నటించనున్నారు. ముఖ్యంగా మొదటి భాగంలో దాక్షాయణిగా నటించిన అనసూయకు ఎక్కువ సేపు తెరపై కనిపించే అవకాశం లేకుండా పోయింది. కానీ రెండో పార్ట్‌లో ఆమె పాత్ర నిడివి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కు గాను సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే కొన్ని ట్రాక్స్‌ను సిద్ధం చేసి ఉంచారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…