Mahesh Babu : ఆచార్య ఈవెంట్‌లో క‌నిపించ‌ని మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఫ్యాన్స్ విచారం..!

Mahesh Babu : మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఆచార్య సినిమాపై ఇప్పుడు అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. రీసెంట్‌గా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌గా, ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ప‌వన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది.

Mahesh Babu

రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరిలో పర్యటించిన పవన్ కల్యాణ్.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక స‌హాయం అందించారు. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా దర్శక దిగ్గజం రాజమౌళి హాజరుయ్యారు. అయితే ప‌వన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు.. అని తెలుసుకున్న ఆచార్య చిత్ర యూనిట్ ఆ తర్వాత మహేష్ బాబును పిలవాల‌ని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉంది.

రామ్ చరణ్ కి కూడా మ‌హేష్ మంచి స్నేహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక‌ కొరటాల శివతో మ‌హేష్ రెండు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు కాబట్టి తప్పకుండా వస్తార‌ని అనుకున్నారు. అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నాడని.. అందుకే హాజరుకాలేక పోయినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా పవన్, మ‌హేష్.. ఆచార్య ఈవెంట్‌కు వచ్చి ఉంటే.. ఆ కిక్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM